Mass Jathara: రవితేజ బ్యాక్ టూ రూట్స్..ఇక మాస్ జాతరే

| Edited By: Phani CH

Jan 27, 2025 | 8:52 PM

కొత్తగా ట్రై చేస్తే నీకు అవసరమా అంటున్నారు..? డిఫెరెంట్‌గా ప్రయత్నిస్తే నీకెందుకు అంటున్నారు. పోనీ కమర్షియల్ సినిమాలు చేస్తేనేమో ఎప్పుడూ అవేనా అంటున్నారు. అందుకే ప్రయోగాలకు గుడ్ బై చెప్పి.. తనకేదైతే కలిసొచ్చిందో.. తననెలాగైతే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాతో వస్తున్నారు. మరి రవితేజ మాస్ జాతర ఎలా ఉండబోతుంది..?

1 / 5

2 / 5
రవితేజ 75వ సినిమా టీజర్ విడుదలైంది. చాలా రోజులుగా మాస్ రాజా ఫ్యాన్స్ వేచి చూస్తున్న ఈ గ్లింప్స్ వచ్చేసింది. ఇది చూసాక అర్థమవుతుంది.. ప్రయోగాలు వద్దు.. పక్కా మాస్ రూట్‌లోకి రవితేజ వచ్చేసారని..! మాస్ జాతర గ్లింప్స్ అంతా ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కట్ చేసారు దర్శక నిర్మాతలు.

3 / 5
సామజవరగమనా లాంటి హిలేరియస్ సినిమాకు రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. తన 75వ సినిమా ఎలాగైతే ఉండాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారో.. అచ్చంగా అలాంటి సినిమా రెడీ చేస్తున్నారు మాస్ రాజా.

4 / 5
ధమాకా తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు రవితేజను బాగా నిరాశ పరిచాయి. మాస్ జాతరలో వింటేజ్ రవితేజ కనిపిస్తున్నారు.

5 / 5
పైగా ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల, భీమ్స్ కాంబో రిపీట్ అవుతుంది ఈ సినిమా కోసం. సితార ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలోనే విడుదల కానుంది మాస్ జాతర. మరి ఈ సినిమాతో మరో ధమాకా వస్తుందేమో చూడాలిక.