రాశీ ఖన్నా..! చబ్బీ చబ్బీగా.. క్యూట్ క్యూట్ గా ఉండే ఈ భామను ఎవరు ఇష్టపడరు చెప్పండి.. అందరూ ఇష్టపడుతారుగా..! ఇష్టపడడమే కాదు.. ఇంకాస్త ముందుకెళ్లి ఆరాధించడం..!
వీలైతే నెట్టింట ప్రపోజ్ చేయడం..! ఇన్‌స్టా లైవ్‌లో కి వచ్చినప్పుడు మ్యారీమీ అని రెక్వెస్ట్ చేయడం.. కూడా చేస్తుంటారు.
అలా చేస్తేనైనా.. రాశీ చూపు తమమీద పడుతుందిగా.. అని ఫీలవుతుంటారు... అల్పసంతోషం కోసం పాకులాడుతుంటారు. సిగ్గుతో రాశీ బుగ్గలు ఎరుపెక్కేలా చేస్తుంటారు.
తక్కువ సమయంలోనే స్టార్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు రాశీ ఖన్నా..! బాలీవుడ్ టూ టాలీవుడ్‌లో ల్యాండ్ అయి.. వయా కోలీవుడ్, మల్లూవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారిపోతున్నారు.
అయితే ఎట్ ఏ టైం ఇన్ని వుడ్స్‌ను కవర్ చేస్తున్న ఈ బ్యూటీ 'ఉరుకుల పరుగుల జీవితం నాది ' అంటూ ఓ పోస్ట్ ను తన అభిమానులతో పంచుకుని సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.
'అయ్యో ఏం కష్టమొచ్చె...' అనే కమెంట్లతో నెటిజన్ల చేతుల్లో మీమ్స్‌గా మారిపోయారు.ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ సినిమా.. మలయాళంలో మరో సినిమా చేస్తున్న ఈ బ్యూటీ...
తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ 'యోధ' సినిమాలో నటించనున్నారట. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ లీడ్ రోల్‌లో ఓ కొత్త డైరెక్టర్ తెరకెక్కించే ఈ సినిమాలో రాశీ ఓ కీ రోల్ చేస్తున్నారట.
అయితే ఈ న్యూస్ అలా బీటౌన్ లో వ్యాపించిందో లేదో... అప్పుడే రాశీ ఖన్నా.. 'ఉరుకుల పరుగుల జీవితం.. ఒక ఎయిర్ పోర్ట్ నుంచి మరో ఎయిర్ పోర్టుకు వెళ్తున్నాను..
గోవాకు వెళ్తున్నాను' అంటూ ఓ తన సోషల్ మీడియా అకౌంట్‌లలో ఓ పోస్ట్ పెట్టడంతో... కరణ్ జోహర్ ఫిల్మ్ కన్ఫర్మ్ అంటూ నెట్టింట కమెంట్లు వినిపిస్తున్నాయి.