
ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సినిమాకు సంబంధించిన వ్యాపారాల్లో తనకు అనుభవం ఉన్నా... ఇతర రంగాల్లో మాత్రం తాను బ్యాడ్ బిజినెస్‌మేన్ అన్నారు. స్టార్‌డమ్‌ను భారంగా కన్నా... బాధ్యతగా ఫీల్ అవుతానని చెప్పారు రామ్‌చరణ్.

ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌కు బ్రేక్ పడటంతో ఈ గ్యాప్‌లో రవితేజతో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్.

టైగర్ 3 రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న సల్మాన్ ఖాన్, నెక్ట్స్ మూవీని ఈ రోజు ప్రారంభిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ది బుల్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. తమిళ దర్శకుడు విష్ణువర్దన్ రూపొందిస్తున్న ఈ సినిమాను ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ రోల్‌లో నటిస్తున్నారు సల్మాన్.

కొలంబియన్ సింగర్ షకీరాకు అరుదైన గౌరవం దక్కింది. 21 అడుగుల భారీ షకీరా విగ్రహాన్ని ఆమె సొంత సిటీ బారన్క్విల్లాలో ఆవిష్కరించారు. ఆమె తల్లి దండ్రుల సమక్షంలో నగర మేయర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓ అమ్మాయి అనుకుంటే ఎంత గొప్ప స్థాయికి చేరుకోగలదో ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేనినట్టుగా చెప్పారు.

Ayalaan