
ప్రజెంట్ మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ జోష్‌లో ఉంది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్‌లో హై మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీంతో అభిమానులు కూడా అదే రేంజ్‌లో హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక్క రామ్ చరణ్ విషయంలోనే కాస్త ఫీల్ అవుతున్నారు. ఇంతకీ చరణ్ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెడుతున్న ఆ అంశమేంటి..? ఈ స్టోరీలో చూద్దాం.

ఆల్రెడీ హోల్ ఇండియా ప్రభాస్ మేనియాతో ఊగిపోతోంది. ఈ నెల 27న మోస్ట్ అవెయిటెడ్ కల్కి 2898 ఏడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా రోజుల కిందటే క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్.

ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఇంతవరకు తారక్ నెక్ట్స్ మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూనియర్, సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానుంది.

అల్లు అర్జున్ కూడా పుష్ప 2 రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15న రావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ 6కు వాయిదా వేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు. స్టార్ హీరోలంతా ఇంత యాక్టివ్‌గా సినిమాలు చేస్తుంటే ఒక్క హీరో మాత్రం నెక్ట్స్ మూవీ ఎప్పుడన్నది క్లారిటీ ఇవ్వటం లేదు.

ట్రిపులార్ రిలీజ్‌కు ముందే గేమ్ చేంజర్ సినిమాను స్టార్ట్ చేసిన రామ్ చరణ్ ఆ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అప్పుడెప్పుడో నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్ రిలీజ్ అని చెప్పినా.,.. అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. దీంతో రిలీజ్ డేట్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.