
రకుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. ఒకప్పుడు టాలీవుడ్ నే షేక్ చేసిన ఈ చిన్నది. తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసి,అక్కడే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని వివాహం చేసుకొని, సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా చీరలో ఉన్న అందమైన ఫొటోలు షేర్ చేసింది.

కెరటం సినిమాతో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అనతి కాలంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరస సినిమాలతో టాలీవుడ్‌నే షేక్ చేసింది.

కరెంట్ తీగ, సరైనోడు, ధృవ, కిక్2 బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో ఇలా చాలా సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ కూడా తన గ్లామర్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరో వైపు బిజినెస్‌లు చూసుకుంటూ చాలా బిజీగా గడిపేస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా డిఫరెంట్ స్టైల్లో చీర కట్టి, అందమైన జ్యువెల్లరీ ధరించి తన అందాలతో కుర్రకారును మాయ చేస్తుంది. ప్రస్తుం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.