
అందాల చిన్నది రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే టాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుని, ఫేవరెట్ నటిగా తన మార్క్ చూపెట్టింది.

ఇక ఈ ముద్దుగుమ్మ సందీప్ కిషన్ సరసన వెంకటాద్రి సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ అంతగా హిట్ అవ్వలేదు, అయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి అని చెప్పాలి. దీంతో ఈ అమ్మడు వరసగా సినిమాల్లో నటించింది.

ముఖ్యంగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సరైనోడు, రామ్ చరణ్ సరసన ధృవ, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, రారండోయ్ వేడుక చూద్దాం, కొండ పొలం కెరటం. ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలన్నీ చాలా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

ఇక ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లింది. కానీ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చక్కేసింది. అక్కడ కూడా వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా అక్కడే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది.

ఇక ఈ అమ్మడు వివాహం తర్వాత ఓ వైపు సినిమాలు మరో వైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఈ చిన్నది తన ఇన్ స్టాలో పింక్ కలర్ లెహెంగాలోని బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.