
మలయాళంలో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో రజిషా విజయన్ ఒకరు.

సూర్య నటించిన 'జై భీమ్'' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ధనుష్ తో కలిసి కర్ణన్ సినిమాలో నటించి మెప్పించింది రజిషా .

ప్రస్తుతం మలయాళ తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తోంది. రవితేజ నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో నటిస్తుంది రజిషా

తెలుగులో నటించాలనే కోరిక మొదట్నుంచీ ఉందని.. తగిన కథ కోసం ఎదురు చూసి ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా చేశానని రజిషా చెప్పింది.

రవితేజ చిత్రాలు కూడా హిందీలో డబ్ అయ్యేవి. నాకూ నా స్నేహితులందరికీ రవితేజ తెలుసు. అప్పుడు ఆయన్ని నేను హిందీ హీరో అనుకున్నాను అని రజిషా విజయన్ చెప్పింది.