రజినీకాంత్ అలా.. కమల్ హాసన్ ఇలా.. ఎందుకు స్వామి నాకిలా

Edited By: Phani CH

Updated on: Jun 27, 2025 | 10:02 PM

బ్లాక్‌బస్టర్ కొట్టడం గొప్ప కాదు.. కొట్టాక కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నావ్ అనేది ముఖ్యం. ఈ విషయంలో కమల్ హాసన్ కంటే రెండాకులు ఎక్కువే చదివారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ ఇద్దరూ దాదాపు ఒకే టైంలో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. అందులో రజినీ స్పీడ్ అందుకుంటే.. కమల్ నెమ్మదించారు. ఇంతకీ దీనికి కారణమేంటి..?

1 / 5
కెరీర్ ఆల్‌మోస్ట్ అయిపోయింది.. ఇంక వీళ్ళకు బ్లాక్‌బస్టర్స్ రావడం కష్టమే అనుకుంటున్న తరుణంలో రజినీకాంత్‌కు జైలర్ వచ్చింది.. ఈ చిత్రం ఏకంగా 600 కోట్లు వసూలు చేసింది.

2 / 5
అదే సమయంలో విక్రమ్ సినిమాతో 20 ఏళ్ళ తర్వాత బ్లాక్‌బస్టర్ అందుకున్నారు కమల్. ఈ సినిమా కూడా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో ఈ ఇద్దరూ మరోసారి జూలు విదిల్చారు.

3 / 5
జైలర్ తర్వాత రజినీ జోరు మామూలుగా లేదు. అఫ్‌కోర్స్.. దాని తర్వాత వచ్చిన వేట్టయాన్, లాల్ సలామ్ ఫ్లాప్ అయ్యాయి కానీ దర్శకుల పరంగా రజినీ దూకుడు చూపిస్తున్నారు. లోకేష్ కనకరాజ్‌తో చేస్తున్న కూలీపై కేవలం తమిళంలోనే కాదు.. మిగిలిన భాషల్లోనూ భారీ అంచనాలున్నాయి.

4 / 5
బిజినెస్ అదే స్థాయిలో జరుగుతుంది.. నెక్ట్స్ లైన్‌లో జైలర్ 2 కూడా ఉంది. విక్రమ్ తర్వాత కమల్ మాత్రం ఇండియన్ 2, థగ్‌లైఫ్ లాంటి ఎపిక్ డిజాస్టర్స్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు దాదాపు 300 కోట్ల నష్టాన్ని తీసుకొచ్చాయి.

5 / 5
ఇండియన్ 3పై అంచనాలైతే లేవు.. అసలు వస్తుందా రాదా అనే క్లారిటీ కూడా లేదు. ప్రస్తుతం వీర ధీర సూరన్ ఫేమ్ ఎస్‌యు అరుణ్ కుమార్‌తో ఓ సినిమా చేయనున్నారు కమల్. మొత్తానికి రజినీ కెరీర్ దూసుకుపోతుంటే.. కమల్ మాత్రం రేసులో వెనకబడిపోయారు.