
ప్రస్తుతం ఎవరి నోట విన్న ఆర్ఆర్ఆర్ డైలాగులు, పాటలు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా. ఇద్దరు స్టార్ హీరోలను కలిపి దర్శక ధీరుడు రాజమౌళి స్క్రీన్ పైన చేసిన మ్యాజిక్ అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది ఈ మూవీ. బొమ్మ పడకముందే..అటు ఆట మొదలవక ముందే.... రేటింగ్స్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోయిన జక్కన్న ట్రిపుల్ ఆర్... అనుకున్నట్టే థియేటర్లను షేక్ చేస్తోంది.

యుద్ధానికి ఆయుధాలే కాదు... ట్రిపుల్ ఆర్ థియేటర్లకు జనాలు కూడా వాళ్లంతట వాళ్లే వస్తున్నారు. రావడమే కాదు ఎకంగా ఉప్పెననే తలపిస్తూ.. థియేటర్లను జన సముద్రాలుగా మారుస్తున్నారు. ట్రిపుల్ ఆర్ 400 కోట్ల భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ.

వాల్డ్‌వైడ్‌గా 15 వేల థియేటర్లలో ట్రిపుల్ ఆర్ సందడి. టార్గెట్ 2K ప్లస్ క్రోర్స్. బాహుబలి-2 కలెక్షన్లు 1810 కోట్లు. అంతకు మించిన రేంజ్‌లో ట్రిపుల్ ఆర్‌పై ఎక్స్‌ప్టేషన్స్. 2వేల కోట్లు వసూలు ఖాయమనే ది జక్కన్న అంచనా. ఈ అంచనా అక్షర సత్యమవుతుందని అంటున్నారు ఫిల్మ్ అనలిస్ట్స్.

ఇక ఒక్క తెలుగు రాస్ట్రాల్లోనే ట్రిపుల్ ఆర్ సినిమా ఫస్ట్ వీక్ లో 180 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 'బాహుబలి 2' సినిమా మొదటి వారంలో 117.77 కోట్లు షేర్ అందుకొని.. లాంగ్ రన్ లో 153 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ రికార్లును ట్రిపుల్ ఆర్ తిరగరాస్తుంది.

అలాగే నార్త్ ఇండియాలో 100 కోట్లు ను క్రాస్ చేసింది. మొదటి వారంలో 131 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 11 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది..

ఓవరాల్‌గా వాల్డ్‌వైడ్‌గా 710 కోట్ల బిజినెస్‌ను ఇప్పటికే తన జేబులో వేసుకున్నారు ట్రిపుల్ ఆర్ మేకర్స్. ఇక ప్రపంచవ్యాప్తంగా 15 వేల థియేటర్లలో సినిమా విడుదల అంటే మాటలా. సగటున 4 ఆటలు.. ఎక్కువ తక్కువలు ఎలా వున్నా టిక్కెట్ ఒక్కంటికి 150 లెక్కన వేస్కున్నా.. వసూళ్లు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించవచ్చు.

ఈ లెక్కన ట్రిపుల్ R బాహుబలి- 2 కలెక్షన్ 1810 కోట్ల రికార్డును క్రాస్ చేయడమే కాకుండా 2వేల కోట్ల టార్గెట్‌ను ఈజీగా రీచ్ కావచ్చు అనేది అదే అనలిస్టుల అంచనా...!