
రాశిఖన్నా..ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రాశి. తొలి సినిమాతోనే ప్రేక్షకులను కవ్వించింది.

తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది రాశి. ఆతర్వాత వరసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసింది ఈ చిన్నది. అలాగే యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది.

తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేసింది. హిందీలో మొన్నీమధ్య ఓ వెబ్ సిరీస్ లో నటించింది .

సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది రాశి. ట్రెడిషనల్ డ్రసింగ్ తో పాటు మోడ్రన్ గాను కనిపిస్తూ ఆకట్టుకుంది. తాజాగా ఈ భామ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.