
అఫీషియల్ అప్‌డేట్ ఒక్కటి కూడా లేకపోయినా... సోషల్ మీడియాలో మాత్రం ఎస్ఎస్ఎంబీ 29 పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కాంబినేషన్స్, కాస్టింగ్‌కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి గ్లోబల్ రేంజ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది మహేష్ మూవీ.

ట్రిపులార్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి ప్రజెంట్ మహేష్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఓ వైపు షూటింగ్ పూర్తి చేస్తూనే కొత్త కాస్టింగ్ డిటైల్స్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం నటీనటుల ఎంపికలోనూ డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు జక్కన్న.గ్లోబల్ ప్రాజెక్ట్‌గా ప్లాన్ చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 29లో మహేష్‌కు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ప్రజెంట్ ఈ మూవీ వర్క్‌లోనే బిజీగా ఉన్నారు పీసీ... జక్కన్న చెప్పకపోయినా, తన సోషల్ మీడియా పోస్ట్‌లతో మహేష్ మూవీ అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.

విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారన్న న్యూస్ కూడా ఆల్రెడీ కన్ఫార్మ్ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్‌లోనే మహేష్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు పృథ్వీరాజ్. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో క్రేజీ ఆర్టిస్ట్ చేరారన్నది నయా అప్‌డేట్.

సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో మంచి క్రేజ్ ఉన్న మాధవన్ కూడా ఎస్ఎస్ఎంబీ 29లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆల్రెడీ కథ విన్న ఈ సీనియర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. త్వరలోనే సెట్‌లో అడుగపెట్టబోతున్నారు. ఇలా వరుసగా మల్టీ లింగ్యువల్ స్టార్స్‌ను లైన్ పెడుతూ సినిమా మీద అంచనాలు పీక్స్‌కు తీసుకెళుతున్నారు రాజమౌళి.