
ప్రణీత సుభాష్.. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సినిమాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రణీత 2010లో కన్నడ చిత్రం పోర్కి (తెలుగు చిత్రం పోకిరి రీమేక్)తో నటిగా అరంగేట్రం చేసింది.

ఈ సినిమాలో ఆమె దర్శన్ సరసన నటించింది. అదే సంవత్సరం తెలుగు చిత్రం ఎం పిల్లో ఎం పిల్లడో , బావ చిత్రాలతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. బావ చిత్రంలో ఆమె తెలుగు గ్రామీణ అమ్మాయి పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

2011లో ఉదయన్ చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది. పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమా చేసింది. ఇందులో ప్రణీత పాత్రకు సంతోషం జూరీ అవార్డు, సినిమా ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది.

ప్రణీత 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. వారికి 2022లో ఒక కుమార్తె (అర్ణా), 2024లో ఒక కుమాడు జన్మించారు. ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఈ చిన్నది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ప్రస్తుతం ప్రణీత సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలను పంచుకుంటుంది ఈ బ్యూటీ. పెళ్ళైన కూడా ఏమాత్రం తగ్గని గ్లామర్ తో కవ్విస్తుంది ఈ భామ.