
"ఖాన్సార్" ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరో నటించిన ఈ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసా.?

డిసెంబర్ 2023లో విడుదలైన ఈ చిత్రానికి థియేటర్లలో మిశ్రమ సమీక్షలు వచ్చాయి, కానీ కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రేయ రెడ్డి కీలకపాత్రలో పోషించారు. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఆ సినిమా పేరు సలార్ పార్ట్ 1. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టి భారీ మొత్తంలో డబ్బును సంపాదించింది.

థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా విజయవంతమైంది. ఇది వరుసగా 366 రోజులు ట్రెండ్‌లో నిలిచింది. సలార్: పార్ట్ 1ఓటీటీలో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రూ.270 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. ఇది దాదాపు 366 రోజులు ట్రెండింగ్ లో టాప్ లో ఉంది. ఓటీటీలో భారీ రెస్పాన్స్ రావడంతో ప్రభాస్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు.