రూటు మార్చిన జిగేల్ రాణి.. ఏం చేస్తుందో తెలుసా?

Edited By: Samatha J

Updated on: Feb 28, 2025 | 12:10 PM

ఇప్పుడున్న పోటీలో రెండేళ్ళ కంటే ఎక్కువ స్టార్ హీరోయిన్ హోదా కంటిన్యూ చేయడం కష్టమే. ఈ లోపు ఎవరో ఒకరు వచ్చేస్తారు.. ఈలోపు మరో దారి చూసుకోవాల్సిందే. పూజా హెగ్డే సైతం ఇదే చేస్తున్నారిప్పుడు. హీరోయిన్ ఆఫర్స్ వస్తే వెల్ అండ్ గుడ్ లేదంటే మాత్రం మరో ఆప్షన్ రెడీగా ఉంది. మరి పూజా ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి..?

1 / 5
ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. హీరోయిన్లకు అయితే మరీనూ..! ఒక్క కొత్తమ్మాయి చాలు.. పాత వాళ్లను పక్కనబెట్టడానికి..! పూజా హెగ్డే విషయంలోనూ ఇదే జరుగుతుంది.

2 / 5
తెలుగులో పూర్తిగా ఖాళీ.. తమిళ్లో ఒకటో రెండో సినిమాలున్నాయి.. దాంతో స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులేస్తున్నారు పూజా. ఇలాగైతే మరో రెండేళ్లైనా సర్వై అవ్వొచ్చని అమ్మడి ప్లాన్.

3 / 5
ఆరేళ్ళ కిందే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసారు పూజా హెగ్డే. జిగేల్ రాణి పాటలో పూజా వేసిన స్టెప్పులకు థియేటర్స్ మోతెక్కిపోయాయి. ఆ తర్వాత ఎఫ్ 3 లో లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా.. అంటూ స్పెషల్ చిందులేసారు. ఇది బాగానే వర్కవుట్ అయింది. తాజాగా రజినీకాంత్ సినిమాలో సూపర్ ఛాన్స్ కొట్టేసారు పూజా.

4 / 5
రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీలో పూజా నటిస్తున్నారు. జైలర్‌లో తమన్నా తరహాలో సాగే పాత్ర ఇదని తెలుస్తుంది.

5 / 5
తాజాగా సెట్స్‌లో జాయిన్ అయ్యారు పూజా. దాంతో పాటు సూర్యతో రెట్రో, విజయ్‌తో జన నాయగన్ సినిమాలు చేస్తున్నారు. ఇవి కాకుండా సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటారు ఈ ముద్దుగుమ్మ.