
అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్దే గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్‌లో వరస సినిమాలు చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. కానీ ఈ బ్యూటీ చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ కావడంతో, తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.

సినిమా అవకాశాలు కూడా ఈ చిన్నదానికి తగ్గిపోయాయనే చెప్పాలి. ప్రస్తుతం పూజా బాలీవుడ్ వైపు కన్నేసి అక్కడ పలు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా బుట్టబొమ్మ తన తన లేటెస్ట్ ఫోటో షూట్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ లెహెంగాలో అదిరిపోయింది. రెడ్ రోస్ ఫ్లవర్‌లా కనిపిస్తూ కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో పింక్ కలర్ లవ్ ఎమోజీలను క్యాప్షన్‌గా పెడుతున్నారు ఈ ముద్దుగుమ్మ అభిమానులు.

ఇక ప్రస్తుతం పూజా హెగ్దే తమిళంలో రెట్రో, జయనాయగన్, కాంచన 4 వంటి చిత్రాల్లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో హైజవానీ తో ఇష్క్ హోనా హై మూవీలో కూడా లైనప్ లో ఉంది.