
లాంగ్ బ్రేక్ తరువాత సినిమాల మీద దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్, వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ హరి హర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసేశారు. ఓజీ షూటింగ్‌కు గుడ్‌బై చెప్పేశారు.

ఇప్పుడు ఉస్తాద్ భగత్‌సింగ్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు పవన్.రీసెంట్‌గా ఉస్తాద్ సెట్‌లో అడుగుపెట్టిన పవర్ స్టార్, బ్రేక్ లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. జూలై ఫస్ట్ వీక్ వరకు జరిగే షెడ్యూల్‌తో దాదాపు షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆ తరువాత మిగిలిన ప్యాచ్ వర్క్ కూడా అదే నెలలో పూర్తి చేయాలన్నది పవన్ ప్లానింగ్. పొలిటికల్ కమిట్మెంట్స్ ఏ మాత్రం డిస్ట్రబ్ అవ్వకుండా సినిమా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు పవర్ స్టార్.

మరో వైపు పవన్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖనితో సినిమా చేసేందుకు పవన్ రెడీ అవుతున్నారన్నది ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతున్న నయా అప్‌డేట్.

పవన్ మరో మూవీకి ఓకే చెప్పారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటోంది ఆయన టీమ్. గతంలో సముద్రఖని దర్శకత్వంలో బ్రో సినిమాలో నటించారు పవన్, ఆ పరిచయంతోనే సముద్రఖని, పవన్‌ను కలిశారే తప్ప.. ఎలాంటి సినిమా టాక్స్ జరగలేదని క్లారిటీ ఇచ్చింది.