
ఇంకెప్పుడు? ఇంకా ఎప్పుడు? అని జనాలు ఎదురుచూసిన హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తయిపోయింది. గుమ్మడికాయ కొట్టేశారు మేకర్స్. రిలీజ్ రోజున థియేటర్లలో హంగామా చేయడానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. పవర్‌స్టార్ కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా కావడంతో ఇంకాస్త హంగామా చేయడానికి మేం రెడీ అంటున్నారు అభిమానులు.

ఇటు ఓజీ పరంగానూ మంచి మాటే వినిపిస్తోంది. సెట్స్ లో పవన్ కల్యాణ్ జాయిన్ అయ్యారు. అప్పుడెప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్.. ఓజీ కోసం మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు పవన్ కల్యాణ్. జనసేనానిని ది బెస్ట్ గా చూపించడానికి పక్కా స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు సుజీత్.

ఓజీ వస్తుంది చూద్దురుగానీ.. అని పవర్‌స్టార్ అప్పట్లో చెప్పిన మాటలు కూడా ఈ సినిమా మీద అమాంతం హైప్ పెంచేశాయి. ఆ హైప్‌ని రీచ్ కావాలంటే ఎక్స్ ట్రా ఎఫర్ట్ కావాల్సిందేనని గట్టిగానే ఎఫర్ట్ పెడుతోంది టీమ్.

అన్నీ కుదిరితే జులై నుంచి ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌లోనూ పార్టిసిపేట్ చేస్తారు పవర్‌స్టార్. ఉస్తాద్ గురించి రీసెంట్‌గా హరీష్ శంకర్ చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో జోష్ తెస్తున్నాయి.

'ఉస్తాద్‌కు సంబంధించి నా బెస్ట్ ఇస్తా.. దీనికోసం నా టీం అంతా రాత్రిపగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు' అని చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. సో 2025 మనదే.. మూవీస్ పరంగా పవర్‌స్టార్ యాక్టివ్‌గా ఉంటే.. అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది? అని మాట్లాడుకుంటున్నారు అభిమానులు.