
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆయన ప్రసంగిస్తే.. ప్రళయం...! స్క్రీన్ పై డైలాగులు చెబితే ప్రభంజనం... అభిమానులతో ముచ్చటిస్తే శాంతం.. అన్నింటిలోనూ సహనం.. మూడు ముక్కల్లో చెప్పాలంటే... ఇదీ పవన్ నైజం...

ఇక పవన్ పుట్టిన రోజు అంటే ఆ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ నటించిన సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా సుస్వాగతం సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో పవన్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రేమించిన అమ్మాయికోసం తాపత్రయపడే యువకుడిగా పవన్ జీవించారని చెప్పాలి. ఈ సినిమా పవన్ కెరీర్‌లో ముట్టమొదటి సూపర్ హిట్ మూవీ.

సుస్వాగతం సినిమా తర్వాత పవన్ నటించిన తొలిప్రేమ సినిమా మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత పవన్ నటించిన బద్రి సినిమా సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో యువతను తెగ ఆకట్టుకుంది

అలాగే పవన్ మేనియాను ఆకాశానికి చేర్చిన సినిమా ఖుషి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలించింది. ఈ సినిమాలో పవన్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, లవ్ స్టోరీ, సాంగ్స్ ఇలా అని కలిపి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలబెట్టాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలు అలరిస్తూనే ఉన్నాయి.

ఖుషి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ పడటానికి పవన్‌కు చాలా టైం పట్టింది. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగులను పవన్ చెప్పిన విధానం ఆకట్టుకుంది.

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ అభిమానుల ఆకలిని తీర్చింది. బాలీవుడ్ దబాంగ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాసింది.

అలాగే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అత్తారింటికి దారేది సినిమాకూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాబ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు మూడేళ్లు సినిమాలు దూరమయ్యారు పవన్. ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు తిరిగి సినిమాల్లోకి వచ్చారు. అలా రీ ఎంట్రీ ఇస్తూనే వకీల్ సాబ్‌గా మరో బ్లాక్ బస్టర్‌ను అనుకున్నాడు పవన్.

ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టి అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు పవన్.