
డిప్యూటీ సీఎం ఎక్కడికెళ్లినా ఓజీ ఓజీ అంటూ అభిమానులు అరవకండి.. సకాలంలో సినిమాను విడుదల చేస్తాం. పర్ఫెక్ట్ గా షూట్ కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం అని ఆల్రెడీ అనౌన్స్ చేసింది ప్రొడక్షన్ హౌస్.

ఇప్పుడు ఇదే విషయాన్ని పవర్‌స్టార్ కూడా ప్రస్తావించారు. ఓజీ.. ఓజీ అని ఫ్యాన్స్ భయపెడుతున్నారంటూ పవర్‌స్టార్ చెప్పిన మాటలు ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్నాయి.

ఆయన కాల్షీట్ కేటాయించినా, షూటింగ్ పూర్తి కాలేదన్నది ఫ్యాన్స్ కి చేరిన వార్త. మరేం ఫర్వాలేదు.. మీకు టైమ్ ఉన్నప్పుడే చేయండి.. బ్లాక్ బస్టర్ చేయడానికి మేం రెడీగా ఉన్నాం అనే ధీమా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో.

వీలున్నప్పుడు కాల్షీట్ ఇచ్చి సినిమాలు కంప్లీట్ చేస్తానన్నది పవన్ కల్యాణ్ మాట. ఆయనకు కుదిరినప్పుడే కాల్షీట్ ఇచ్చినా 2025లో ఓజీ కంప్లీట్ అవుతుందన్నది ఫ్యాన్స్ అంచనా.

డిసెంబర్ ఎండింగ్‌లో పవన్ కళ్యాణ్ షూట్‌లో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు హరిహర వీరమల్లును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. మొత్తానికి 2025లో పవన్ నుంచి రెండు సినిమాలైతే పక్కా.

కానీ, ఇంకా ఎనిమిది రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని చెప్పేశారు పవర్‌స్టార్. మార్చిలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలోనే సినిమాను కంప్లీట్ చేస్తారనే టాక్ నడుస్తోంది.

చెప్పినట్టు సమ్మర్‌కి హరిహరవీరమల్లుతో వచ్చేయాలని ఫిక్సయ్యారు పవన్. 80, 90ల్లో జరిగే పీరియాడిక్ కథతో ప్యాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు పవర్‌స్టార్. ఈ సినిమా ఇచ్చే రిజల్టును బట్టి, ఓజీని డిజైన్ చేయాలని ఫిక్సయ్యారు సుజీత్.