
ఈ రోజుల్లో ఓ పాన్ ఇండియన్ సినిమా విడుదలవుతుందంటే.. కనీసం 2 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయి. కానీ ఇక్కడ హరిహర వీరమల్లు విషయంలో సీన్ రివర్స్‌లో జరుగుతుంది.

రిలీజ్‌కు ఇంకా రెండు వారాలు కూడా లేదు.. అయినా కూడా ఇప్పటికీ ట్రైలర్ రాలేదు.. పూర్తిస్థాయి ప్రమోషన్స్ జరగట్లేదు. దీనిపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో.. మిగిలిన హీరోల సినిమాల్లా దీన్ని ప్రమోట్ చేయలేకపోతున్నారు. ఉన్న తక్కువ సమయాన్నే వీలైనంత వరకు వాడుకోవాలని చూస్తున్నారు మేకర్స్.

ఈ మధ్యే డబ్బింగ్ కూడా పూర్తి చేసారు పవన్. ఇక జూన్ మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తామని చెప్పారు నిర్మాత ఏఎం రత్నం. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జూన్ 8న జరగబోతుంది.

భారీ ఎత్తున ఈ వేడుక ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పవన్ కూడా ఈ ఈవెంట్‌కు రానున్నారు. అలాగే చెన్నైలో ఈవెంట్ అయిపోయింది.. ముంబైలోనూ ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. వారణాసిలో ప్రీ రిలీజ్ అనుకున్నారు గానీ సమయం లేకపోవడంతో కుదర్లేదు. మొత్తానికి ఉన్న 10 రోజుల్నే జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.