
మీరున్నచోటే ఉండండి... ఎనిమిది వారాల్లో మీ దగ్గరకి మేమే వస్తామని ఓటీటీల్లో మనం నట్టింటికి వెళ్తుంటే, థియేటర్లకు జనాలు ఎందుకొస్తారంటూ ఈ మధ్య ఆమిర్‌ఖాన్ అన్న మాటలు ఇండస్ట్రీని ఆలోచనల్లో పడేశాయి.

భారీ విజువల్ ఎఫెక్స్ట్, అత్యద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలైతే తప్ప థియేటర్లకు జనాలు రావట్లేదనే మాటలు మరోసారి వినిపిస్తున్నాయి. అందుకే కొన్ని సినిమాలకు మాత్రమే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నచ్చే కంటెంట్ ఎంత ఉన్నా, సినిమా బావుందనిపించుకున్నా థియేటర్లకు ఆడియన్స్ రావడం గగనమైపోతోంది. రీసెంట్‌గా సారంగపాణి జాతకం సినిమా అద్భుతంగా ఉందనిపించుకున్నా, థియేటర్లలో జనాలు కనిపించలేదు.

మీడియం రేంజ్ హీరోల సినిమాలకే కాదు, పెద్ద హీరోల సినిమాలకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓ భాషలో బాగా ఆడిన సినిమాలు కూడా మరో భాషలో థియేటర్లకు జనాలను పుల్ చేయడంలో విఫలమవుతున్నాయి.

దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా థియేటర్లలో రిలీజ్‌ని మానుకుంది భూల్ చుక్ మాఫ్. వారం తర్వాత ఓటీటీలో ప్రదర్శనకు రెడీ అయింది. స్త్రీలాంటి సూపర్‌హిట్ సినిమాలో నటించిన రాజ్‌కుమార్ రావు యాక్ట్ చేసిన మూవీ ఇది. పరిస్థితులు మామూలుగా ఉంటే మంచి కలెక్షన్లనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకూడదని ఓటీటీకే ఫిక్సయ్యారు మేకర్స్.