OG Teaser: మాస్ లుక్ లో ఆకట్టుకున్న పవన్ Kalyan.. అదిరిపోయిన ఓజీ మూవీ టీజర్..
ప్యాన్ ఇండియా లెవల్లో ఓ స్టార్ పరిచయమవుతుంటే ఎలా ఉండాలి? ట్రెండ్‌లో ఉండాలి. ఫెలో ఆర్టిస్టుల్లో టెన్షన్ క్రియేట్ చేయాలి. మాస్ ఎంట్రీ ఉండాలి. అద్దిరిపోయే ఎలివేషన్ ఉండాలి. ఇదిగో... ఇవన్నీ ఉన్నాయంటున్నారు ఓజీ టీజర్ చూసినవారు. ఇన్నాళ్ల వెయిటింగ్‌కి కడుపు నిండిపోయే ఫీస్ట్ ఇచ్చేశారని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నెట్టింట్లో ఎ టు జెడ్ అంతా ఓజీ మేనియానే. పవన్ కల్యాణ్ పుట్టినరోజు గిఫ్ట్ గా రిలీజ్ అయింది ఓజీ టీజర్. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన చేస్తున్న స్ట్రెయిట్ సినిమా ఇది. అందులోనూ ప్యాన్ ఇండియా లెవల్‌లో ఎంట్రీని దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్టు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది.