
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన చిత్రం స్పై. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం జూన్ 29న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

దీంతో మూవీ ప్రమోషన్లలో చిత్రబృందం బిజిబిజీగా ఉంటోంది. ఇటీవలే నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య ముంబైలో ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు స్పై టీమ్ బెంగళూరులో అడుగుపెట్టింది.

నటుడు నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్ ఐశ్వర్య మీనన్ బెంగళూరులో మూవీని ప్రమోట్ చేయనున్నారు. కాగా బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగానే హీరో, హీరోయిన్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీతో స్పై తెరకెక్కింది. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్1, 2 చిత్రాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గర్రి బిచెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు

'ఎవరు', 'హిట్' చిత్రాలను అందించిన నిర్మాత కె.రాజశేఖర్ రెడ్డి, చరణ్ రాజ్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని రూపొందించారు. నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.