
ప్రముఖ మలయాళ నటి నజ్రియా నజీమ్ పుట్టిన రోజు నేడు (డిసెంబర్ 20). పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో నజ్రియా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులోనూ ఈమెకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. రాజారాణి సినిమాతో మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఈ సొగసరి ఇటీవల నానితో కలిసి అంటే సుందరానికి సినిమాలో సందడి చేసింది.

నజ్రియా ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ సినిమాలు చేసుకుంటూ తమ దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

కన్నడ సెలబ్రిటీలతో నజ్రియాకు మంచి అనుబంధం ఉంది. మేఘనా రాజ్, నజ్రియా ప్రాణ స్నేహితులు. రాయన్ నామకరణానికి నజ్రియా కూడా హాజరయ్యారు.

మేఘనా రాజ్ ఇంతకు ముందు మలయాళ సినిమాల్లో కూడా నటించింది. ఆ సమయంలోనే మేఘన, నజ్రియాల మధ్య స్నేహం చిగురించింది.