
సౌత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఫాలోయింగ్ హీరోయిన్లలో నయనతార ఒకరు. లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార.

తెలుగుతోపాటు..తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే నయన్ ఇప్పటివరకు సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండదు.

ఇప్పటివరకు నయనతారకు సోషల్ మీడియాలో ఇన్ స్టా, ట్విట్టర్ అకౌంట్స్ లేవు. అలాగే అటు సినిమా ప్రమోషన్స్, ఈవెంట్లలోనూ అంతగా కనిపించదు నయన్.

తాజాగా నయనతారకు సంబంధించిన కొన్ని బ్యూటీఫుల్ ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు నయన్ ఫోటోస్ పై పడింది.

నిజమే మరీ.. ఆ ఫోటోలలో అచ్చం దివినుంచి దిగివచ్చిన దేవకన్యలా కనిపిస్తోంది. తెల్ల చీరలో అవార్డ్ ప్రధానోత్సవంలో సందడి చేసింది నయన్. ఆమెకు సంబంధించిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ప్రస్తుతం నయన్.. బాలీవుడ్ హీరో షారుఖ్ సరనస జవాన్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ జవాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఇదే అవార్డ్ వేడుకలలో తన పిల్లల ఫుల్ నేమ్స్ సైతం బయటపెట్టింది. మొదటి కుమారుడి పేరు ఉయర్ రుద్రోనిల్ ఎన్ శివన్ .. రెండవ కుమారుడి పేరు ఉలాగ్ ధైవాగ్ ఎన్ శివన్ అంటూ క్యూట్‌గా చెప్పింది.