Phani CH |
Jul 26, 2022 | 2:20 PM
తెలిసి చేసినా, తెలియక చేసినా పొరపాటు పొరపాటే. కరణ్ జోహార్ షోలో జరిగింది కూడా పొరపాటేనా? మరి కరణ్ తెలిసి చేసినట్టా? తెలియక చేసినట్టా? ఆయన మనసులో ఏం ఉన్నా... మేం మాత్రం వదలా బొమ్మాళీ అంటున్నారు లేడీ సూపర్‌స్టార్ ఫ్యాన్స్.
తాను ఎప్పుడూ త్రిషకి పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పుకునే సమంత, రీసెంట్ టైమ్స్ లో నయనతారకి బాగా అటాచ్ అయ్యారు. అదే ఇష్టంతోనే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తనకు నచ్చిన సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్‌గా నయన్ పేరును అడ్రస్ చేశారు.
నయన్ పేరు వినగానే కరణ్ స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. నా లిస్టులో ఆమె లేదు అని కరణ్ అన్న తీరుకు నయన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇప్పుడు జాన్వీకపూర్‌తో కరణ్ తీస్తున్న గుడ్‌లక్ జెర్రీ ఒరిజినల్‌లో యాక్ట్ చేసింది నయనే అని కొందరు గుర్తుచేస్తే, ఇంకొందరు మాత్రం నయన్‌కున్న హవా గురించి మాట్లాడుతున్నారు.
సౌత్‌లో నయనతారకున్న ఇమేజ్ చాలా గ్రేట్ అనీ, త్వరలో జవాన్‌తో నార్త్ ఎంట్రీ ఇస్తున్నారనీ, లేడీ సూపర్‌స్టార్‌గా ఆమె స్టామినాను నార్త్ వాళ్లు చూసే టైమ్ కూడా వస్తుందని ట్వీట్లు చేస్తున్నారు.