
బిగ్‍బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది నయని పావని. హౌస్ లో ఉన్నది వారం రోజులే అయిన తన ఆట తీరుతో అందరినీ మెప్పించింది.

కానీ వెళ్లిన వారం రోజులకే ఎలిమినేట్ అయ్యింది. బిగ్‍బాస్ సీజన్ 7లో అత్యంత ఎమోషనల్ ఎలిమినేషన్ ఎపిసోడ్ అంటే ఈ బ్యూటీదే అని చెప్పాలి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ తో కలిసి నయని పావని సూపర్ హిట్ సాంగ్ కుర్చి మడతపెట్టి పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి.

కుర్చి మడతపెట్టి పాటకు వీరిద్దరూ కలిసి డాన్స్ ఇరగదీశారు. ఈ పాటలోని కొన్ని స్టెప్పులకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది నయని పావని.

ఎర్రకోకలో మతిపోగొట్టేస్తోన్న బిగ్‍బాస్ బ్యూటీ.. నెట్టింట నయని పావని అందాల రచ్చ..