
ఇదిగో.. నాని అంటే మన ఆడియన్స్‌కు ఇలాగే కూల్‌గా పక్కింటి అబ్బాయిగా కనిపిస్తుంటారు. ఏమండోయ్ నానిగారూ అంటే.. ఆ అంటూ పలికేంత దగ్గరగా ఉంటాయి ఆయన పాత్రలు.

కానీ మెల్లగా మాస్ వైపు టర్న్ అవుతూ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరంగా వెళ్తున్నారు న్యాచురల్ స్టార్. ఈయన సినిమాల్లో రానురాను వయోలెన్స్ మరీ ఎక్కువైపోతుంది.

కెరీర్ మొదట్నుంచి అప్పుడప్పుడూ మాస్ సినిమాలు చేస్తున్నా.. నాని ఫోకస్ అంతా క్లాస్‌పైనే ఉండేది. కానీ దసరా తర్వాత రూట్ మార్చారు నాని. హాయ్ నాన్నతో ఓసారి అలా క్లాస్ టచ్ ఇచ్చినా.. సరిపోదా శనివారంతో మళ్లీ యాక్షన్ బాటే పట్టారు.

ఇక ఇప్పుడు సెట్స్‌పై ఉన్న సినిమాలు చూస్తుంటే.. పాత నాని కనిపించడం కష్టమే అనిపిస్తుంది. హిట్ 3, ప్యారడైజ్ సినిమాల్లో వయోలెన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుంది. పిల్లలకు నో ఎంట్రీ అని తేల్చేసారు నాని.

వీటివల్ల మార్కెట్ పెరుగుతుందేమో కానీ.. కెరీర్‌కు అండగా నిలిచిన ఫ్యామిలీ ఆడియన్స్‌కు నాని దూరం అవుతున్నారేమో అనే చర్చ మొదలైందిప్పుడు. మరి చూడాలిక.. నాని ధైర్యమేంటో..? ఆయనేం చేయబోతున్నారో..?