Nani: నాని అనేది పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్.. స్టార్ హీరోలకు కూడా వణుకు పుట్టిస్తున్న న్యాచురల్ స్టార్

Edited By: Phani CH

Updated on: May 17, 2025 | 4:37 PM

నాని అనేది ఇప్పుడు పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్. సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే.. వచ్చిన సినిమాలతో కాదు రాబోయే సినిమాలతో కూడా నాని సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారిప్పుడు. ఇంకా షూటింగే మొదలు కాని ది ప్యారడైజ్ సినిమాతో ఊహించని రికార్డుకు తెరతీసారు న్యాచురల్ స్టార్. మరి అదేంటి..? ఇంతకీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు కాబోతుంది..?

1 / 5
నాని సక్సెస్ రేషియో చూస్తుంటే మిగిలిన హీరోలకు కళ్లు బైర్లు గమ్ముతున్నాయి. తన రేంజ్‌లో ఉన్న హీరోలెవరూ.. అందుకోలేని స్థాయిలో ఉన్నారు న్యాచురల్ స్టార్. ఒకప్పుడు ఆయన సినిమాకు 40 కోట్లు వస్తే గొప్ప అనేవాళ్లు.

2 / 5
కానీ మొన్న హిట్ 3తో ఫస్ట్ డేనే 43 కోట్లు వసూలు చేసారు నాని. 4 రోజుల్లోనే 100 కోట్లు కొట్టింది ఈ సినిమా. దానికి ముందు సరిపోదా శనివారం కూడా సెంచరీ కొట్టింది. దసరా నుంచి నాని కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. 2023లో వచ్చిన ఈ చిత్రం 120 కోట్లకు పైగా వసూలు చేస్తే.. క్లాస్ సినిమాగా వచ్చిన హాయ్ నాన్న కూడా 70 కోట్లు కొల్లగొట్టింది.

3 / 5
ఇక సరిపోదా 100 కోట్లు.. తాజాగా హిట్ 3తో మరోసారి 100 కోట్లు వసూలు చేసారు నాని. ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చేస్తున్నారీయన. దసరా కాంబినేషన్ కావడంతో.. షూటింగ్ మొదలవ్వక ముందే బిజినెస్‌లో కొత్త రికార్డులు సెట్ చేస్తుంది ప్యారడైజ్.

4 / 5
ప్యారడైజ్‌కు సంబంధించి జస్ట్ ఒక్క టీజర్ మాత్రమే విడుదల చేసారు మేకర్స్. అప్పుడే నాని కెరీర్‌లో హైయ్యస్ట్ బిజినెస్ చేస్తుంది ఈ సినిమా. ప్రముఖ ఆడియో కంపెనీ సరెగమ ప్యారడైజ్ ఆడియో రైట్స్‌ను ఏకంగా 18 కోట్లకి కొనేసింది. టైర్ 1 అని మాట్లాడుకునే స్టార్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాని మొత్తం ఇది.. ఇంకా చెప్పాలంటే వాళ్లకంటే ఎక్కువే.

5 / 5
దసరా కాంబినేషన్ రిపీట్ అవుతుండటం.. నాని ఫామ్.. అనిరుధ్ మ్యూజిక్.. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ ఇవన్నీ ప్యారడైజ్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం సెట్ వేస్తున్నారు. మేలోనే షూట్ మొదలు కానుంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చ్ 26, 2026న విడుదల కానుంది ప్యారడైజ్.