నందిత శ్వేత 30 ఏప్రిల్ 1990న కర్ణాటకలోని బెంగుళూరులో శ్వేతగా జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త మరియు ఆమె తల్లి గృహిణి. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఆమె క్రైస్ట్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
శ్వేత స్కూల్‌లో చదువుతున్నప్పుడే ఉదయ మ్యూజిక్‌లో వీజేగా కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె 2008 కన్నడ చిత్రం నంద లవ్స్ నందితలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. చిత్రంలో ఆమె పాత్రకు నందిత అని పేరు పెట్టారు, ఆ తర్వాత ఆమె తన స్క్రీన్ పేరుగా మార్చుకుంది.
2016లో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. తర్వాత తెలుగు వరుస సినిమాలు చేస్తూ బిజీగా అయింది.
2018లో శ్రీనివాస కళ్యాణం సినిమా నితిన్ మరదలుగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అదే ఏడాది హీరో సత్యదేవ్ సరసన బ్లఫ్ మాస్టర్ అనే మరో తెలుగు సినిమాలో కథానాయకిగా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
2019లో ప్రేమ కథా చిత్రం 2, అభినేత్రి 2, రాజశేఖర్ కల్కి చిత్రాల్లో ఆకట్టుకుంది. 2021 కపటధారి, అక్షర సినిమాలు చేసింది. 2022లో జెట్టీలో నటించింది. చివరి 2023లో హిడింబా, మంగళవారం, రా రా పెనిమిటి సినిమాల్లో కనిపించింది. గత ఏడాది చిత్రాల్లో రాఘవ రెడ్డి, OMG: ఓ మాంచి ఘోస్ట్ చిత్రాల్లో నటించింది.