
లేటెస్ట్ గా జైపూర్‌లో కీ షెడ్యూల్ పూర్తి చేశారు బాలయ్య. త్వరలోనే నందమూరి బాలకృష్ణ సినిమా టైటిల్ టీజర్‌ని రిలీజ్ చేస్తారు మేకర్స్.

ఇయర్ స్టార్టింగ్‌లో వీరసింహారెడ్డితో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించారు. ఇయర్ ఎండింగ్‌లో శ్రీలీలకు గార్డియన్‌గా ఉయ్యాలో ఉయ్యాలా అంటూ ఇచ్చిపడేద్దాం అంటూ భగవంత్ కేసరితో ఆకట్టుకున్నారు.

ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా క్లౌడ్‌నైన్‌లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. అయినా సినిమాల షూటింగుల పరంగానూ దూసుకుపోతున్నారు.

నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నియర్ ఫ్యూచర్‌లో రిలీజ్ చేయబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఓ ఇంట్రస్టింగ్ డిస్కషన్‌కి తెర లేపినట్టయింది. ఒకరూ, ఇద్దరూ కాదు.. అంతకు మించే.. కెప్టెన్లు వీళ్లిద్దరు ఇచ్చే హిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య.. ఈ మధ్యే బాబీ సినిమా లొకేషన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. NBK 109 షూట్ ప్రస్తుతం హిమాయత్ సాగర్‌లో జరుగుతుంది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్ ముంబైలో జరుగుతుంది.

సినిమాలు మాత్రమే కాదు.. అన్‌స్టాపబుల్ సీజన్ 4కి కూడా రంగం సిద్ధమవుతోంది. నాలుగో సీజన్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్నారు ఆహా. ఈసారి రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారని తెలుస్తుంది.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి సినిమాలు, డిజిటల్, రాజకీయాలు, బసవతారకం.. అన్నింటికీ టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు బాలయ్య.