అందాల ముద్దుగుమ్మ నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నటి మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. తర్వాత బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
తర్వాత మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరి వివాహం తర్వాత ఈ నటి పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి, తన కుటుంబాన్ని చూసుకోవడంలోనే లీనమైపోయింది.
ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూ, మరో వైపు బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటుంది నమ్రత. ఇక ఎప్పుడూ సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉండే ఈ నటి ఎప్పటికప్పుడు తన ఫొటోలను, తన పిల్లల ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటుంది.
తాజాగా నమ్రత శిరోద్కర్ రెడ్ లెహెంగాలో ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న తన ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో చూడటానికి అచ్చం మహారాణిలా కనిపిస్తుంది. దీంతో తన ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
బ్యూటిఫుల్, అచ్చం దేవకన్యలా చూడటానికి చాలా బాగున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.