
అక్కినేని నాగార్జున క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. గ్రీకువీరుడు, మన్మథుడు, కింగ్ అంటూ అమ్మాయిల హృదయాల్లో స్థానం సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ప్రస్తుతం నాగ్ వయసు 66 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతోపాటు.. ఫిట్‌నెస్ విషయంలోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తుంటారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ సీక్రెట్ పంచుకున్నారు. తాను ఎప్పుడూ కడుపు మాడ్చుకుని డైటింగ్ చేయలేదని అన్నారు.

అలాగే ఎప్పుడూ జిమ్ చేయకుండా ఉండలేదట. దాదాపు 45 సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నానని.. ఏరోజు దానిని మిస్ చేయలేదని తెలిపారు. ఆరోగ్యం బాలేక.. వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే తప్ప జిమ్ చేయకుండా ఉంటానని అన్నారు. అలాగే ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

ప్రతి విషయానికి నిరుత్సాహపడనని అన్నారు. 2025 ఏడాది తాను చాలా సంతోషంగా ఉన్నానని.. అటు కెరీర్, ఇటు పర్సనల్ లైఫ్ చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అటు అఖిల్ వివాహం.. నాగ చైతన్య, శోభిత పెళ్లై ఏడాది గడిచిందని తెలిపారు.

ఆ రెండు జంటలను చూస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇన్నా్ళ్లు హీరోగా నటించిన నాగ్.. ఇప్పుడు పాత్ర నచ్చితే విలన్ రూల్స్ సైతం చేస్తున్నారు. ఇటీవలే కుబేర, కూలీ చిత్రాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.