ప్రభాస్ ఈజ్ ఈక్వెల్ టూ బిజీ..! ఆయన చేస్తున్న సినిమాల గురించి కాస్త కొత్తగా చెప్పాలంటే ఇలాగే డిస్క్రైబ్ చేయాలేమో..? ఖాళీ అనే మాటే లేకుండా దూసుకుపోతున్నారు రెబల్ స్టార్. ఇప్పుడు కూడా రాజా సాబ్‌తో పాటు హను రాఘవపూడి ఫౌజీని ఒకేసారి పూర్తి చేస్తున్నారు ప్రభాస్. వీటి తర్వాత కల్కి 2తో పాటు సలార్ 2 కూడా లైన్‌లో ఉన్నాయి.
ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నారనే విషయంపై అభిమానులకు క్లారిటీ ఉంది గానీ.. అవెప్పుడు వస్తాయి.. ఏది ముందు ఏది తర్వాత అనే విషయంపై మాత్రం కన్ఫ్యూజన్ అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్.
ఎవడే సుబ్రమణ్యం పదేళ్ళు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కల్కి 2 హాట్ టాపిక్ అయింది. రాజా సాబ్, ఫౌజీ జులైలోపే పూర్తి కానున్నాయి. వీటి తర్వాత స్పిరిట్ సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఈ సినిమా కోసం ప్రభాస్ దగ్గర 70 రోజులకు పైగా బల్క్ డేట్స్ తీసుకున్నారు సందీప్ రెడ్డి వంగా. ఈ లెక్కన అక్టోబర్ నాటికి స్పిరిట్ షూట్ పూర్తి కావాలి. తాజాగా నాగ్ అశ్విన్ కూడా డిసెంబర్ నుంచి కల్కి 2 మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
కల్కి 2 స్టోరీ ఐడియా కూడా చెప్పారు నాగీ. పార్ట్ 1 కంటే సీక్వెల్‌లో ప్రభాస్‌కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని.. ప్రధానంగా కర్ణుడు, భైరవ క్యారెక్టర్స్ చుట్టూ కథ తిరుగుతుందన్నారు నాగ్ అశ్విన్. అలాగే కమల్ సుప్రీమ్ యస్కిన్, అశ్వద్ధామ కూడా కల్కి 2కు కీలకమే. ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని.. ప్రభాస్ ఫ్రీ అవ్వగానే షూట్ మొదలు పెడతామన్నారు నాగీ.