పదేళ్ళ నుంచి బాలీవుడ్‌లో ఉన్నా రాని పేరు.. తెలుగులో రెండంటే రెండు సినిమాలతోనే తెచ్చుకున్నారు మృణాళ్ ఠాకూర్. నార్త్‌లో అరడజన్ సినిమాలు.. దానికి ముందు సీరియల్స్ చేసినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.
అలాంటి సమయంలో సీతా రామం అనే ఒక్క సినిమా ఈమె జాతకాన్ని మార్చేసింది. హాయ్ నాన్నతో తెలుగులో సెటిలయ్యే ఛాన్స్ వచ్చింది. ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచినా.. మృణాళ్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో ఆఫర్స్ బానే వస్తున్నాయి.
కానీ ఈమె మాత్రం సౌత్ వైపు పెద్దగా చూడట్లేదు. ఏదో మొహమాటానికి 2 సినిమాలు చేసారేమో అనిపిస్తుంది ఈమె తీరు చూస్తుంటే..! బాలీవుడ్‌పై ప్రేమతో ఈ మధ్య ఫోటోషూట్స్‌లోనూ గ్లామర్ డోస్ భారీగానే పెంచేసారు మృణాళ్ ఠాకూర్.
హిందీలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో పాటు సన్నాఫ్ సర్దార్ 2లో నటిస్తున్నారు మృణాళ్. మరో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
తెలుగులో ప్రస్తుతం అడివి శేష్‌తో డెకాయిట్‌లో మాత్రమే నటిస్తున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఇక్కడెన్ని ఛాన్సులిచ్చినా.. ఇస్తామని చెప్పినా.. మృణాళ్ మనసు మాత్రం ఛలో ముంబై అనే అంటుంది.