- Telugu News Photo Gallery Cinema photos Mrunal Thakur is the first heroine who got more craze among the heroines from North Telugu actors Photos
Mrunal Thakur: వెండితెర మీద కొత్త సీతమ్మ.. ఫస్ట్ సినిమాతోనే తెలుగు కుర్రకారులను మదిని దోచుకున్న మృణాల్..
Mrunal Thakur: ఒక్క సినిమాతోనే సౌత్ ఆడియన్స్ మనసు దోచిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ... తెలుగు ప్రేక్షకుల మోస్ట్ ఫేవరెట్ లిస్ట్‌లో చేరిపోయారు.
Updated on: Aug 10, 2022 | 6:16 PM

ఒక్క సినిమాతోనే సౌత్ ఆడియన్స్ మనసు దోచిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ...

తెలుగు ప్రేక్షకుల మోస్ట్ ఫేవరెట్ లిస్ట్‌లో చేరిపోయారు. భారీ అంచనాల మధ్య బిగ్ మూవీస్‌తో పరిచయం అయిన స్టార్ కిడ్స్‌కు రాని క్రేజ్.. ఒక్క సినిమాతోనే సాధించారు మృణాల్.

సీతా... ఈ పేరును తెర మీద మోయటం అంటే అంత ఈజీ విషయం కాదు. కానీ ఆ టాస్క్‌ను చాలా ఈజీగా క్యారీ చేశారు మృణాల్ ఠాకూర్.

గతంలో క్లాసిక్స్‌గా నిలిచిపోయిన సినిమాల్లో హీరోయిన్స్‌ను గుర్తు చేస్తూ సౌత్ సినిమా మీద తనదైన ముద్ర వేశారు.

ఉత్తరాది భామే అయినా... అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించి మురిపించారు మృణాల్.

రీసెంట్‌గా ట్రిపులార్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చారు అలియా భట్. ఆల్రెడీ బాలీవుడ్‌లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న అలియా, సౌత్ ఎంట్రీ కావటంతో ఇండస్ట్రీ జనాలు కూడా గట్టిగానే హడావిడి చేశారు.

కానీ సినిమా రిలీజ్ తరువాత ఆ సందడి కనిపించలేదు. అలియా గురించి పెద్దగా మాట్లాడుకున్న వారే లేరు.కానీ సీతారామమ్ విషయంలో సీన్ వేరు.

సినిమా, కథ, దర్శకుడు, హీరో ఇలా ప్రతీ విషయం గురించి మాట్లాడుతున్న ఆడియన్స్.. హీరోయిన్ గురించి కూడా స్పెషల్‌గా మెన్షన్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఏ నార్త్ బ్యూటీ విషయంలో రాని క్రేజ్ మృణాల్ విషయంలో కనిపిస్తుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

వెండితెర మీద కొత్త సీతమ్మ గా మంచి పేరు తెచ్చుకున్నారు మృణాల్ ఠాకూర్..

వెండితెర మీద కొత్త సీతమ్మ గా మృణాల్ ఠాకూర్..
