
దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న సినిమా సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది హీరోయిన్ మృణాల్

నా మొదటి సీరియల్ బాలీవుడ్‌లో `కుంకుమభాగ్య.` అది అన్ని భాషల్లో డబ్ అయింది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలా తెలుగులో వైజయంతి మూవీస్ బేనర్ లో హీరోయిన్ గా చేస్తానని అనుకోలేదు. అందులోనూ దుల్కర్ సల్మాన్ హీరోగా, అశ్వనీదత్ నిర్మాతగా చేస్తున్న సినిమా నాకు ఇదో గొప్ప అచీవ్ మెంట్.

హిందీ జర్సీ రీమేక్ షూటింగ్ జరుగుతుండగా నేను చంఢీగర్ లో వున్నాను. హనుగారు ఫోన్ చేసి ఒకసారి కలవాలన్నారు. అలా ముంబైలో కాఫీషాప్ లో కలిశాం. ఆ తర్వాత పూర్తి కథను ఆఫీసులో విన్నా. ఆయన నెరేషన్ చేసే విధానం నా ఎగ్జైట్‌మెంట్ చూసి వెంటనే ఫిక్స్ చేశారు.

నా మొదటి సినిమా లవ్ సోనియా. ఫిలింఫెస్టివల్ మెల్‌బోర్న్‌లో జరుగుతుండగా అక్కడ నాగ్ అశ్విన్ గారు కలిశారు. అక్కడ మహానటి సినిమా గురించి నాగ్ వచ్చారు. అందులో కీర్తిసురేష్ అద్భుతంగా నటించింది. అలా నాగ్ గారు పరిచయం వైజయంతి ఫిలింస్‌లో నేను భాగమయ్యాను.

సీతా రామంలో సీత పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి నటికి సీత పాత్ర చేయాలనే డ్రీమ్ వుంటుంది. నేను ధైర్యంగా చెబుతున్నా. ఇది నా పుట్టినరోజు గిఫ్ట్‌గా భావిస్తున్నాను.

సీతారామం ఇండియన్ సినిమాలో బేక్ త్రూ అవుతుంది. నాకు కథక్ అంటే ఇష్టం. ఇందులో కొరియోగ్రాఫర్ బృందగారు చాలా ఎక్సెప్రెషన్స్ చూపించారు. ఇది రొమాంటిక్ ప్రాజెక్ట్. సీతారామంలో నా పాత్రలో ఐదు షేడ్స్ వుంటాయి. కెరీర్ లో అరుదుగా వచ్చే పాత్ర ఇది. దుల్కర్ సల్మాన్ తో నటించడం చాలా ఆనందంగా వుంది.

ఇంతకుముందు నేను మోడ్రన్ దుస్తులు వేసి చేశాను. తొలిసారిగా ఇండియన్ ట్రెడిషన్ లో నన్ను నేను చూసుకోవడం ఆనందంగా వుంది. సీతగా అందరూ ఓన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూశాక తెలుగు, తమిళం, మలయాళంలోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇందుకు అశ్వినీదత్, స్వప్నగారికి నేను రుణపడి వుంటాను.