చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా..? ఐదేళ్లుగా చెప్తూనే ఉన్నారు.. స్వయంగా చిరంజీవే చెప్పినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.. ఇంకేంటి వచ్చేది అన్నీ గాలికబుర్లే అనుకుంటున్నారు కదా..? కానీ ఈ గాలి ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తుంది. చిరుతో సినిమాకు గురూజీకి ఇంతకంటే మంచి టైమ్ మరోటి లేదు. మరి ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

విశ్వంభర చేస్తూనే.. మరో సినిమా చేయాలని చూస్తున్నారు చిరు. అందుకే అనిల్ రావిపూడితో కథాచర్చలు జరిగాయి.. అలాగే త్రివిక్రమ్‌తోనూ సినిమా చేయాలని చూస్తున్నారు చిరంజీవి. నిజానికి ఐదేళ్ళ కింద వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకలోనే తమ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేసారు మెగాస్టార్. కానీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. తర్వాత చిరు, త్రివిక్రమ్ ఇద్దరూ బిజీ అయిపోయారు. కానీ ఈ కాంబోపై చర్చ మాత్రం నడుస్తూనే ఉంది.

త్రివిక్రమ్ రైటర్‌గా ఉన్నపుడు జై చిరంజీవకు చిరుతో పని చేసారు. ఆయన డైరెక్టర్ అయ్యాక.. చిరు రాజకీయాల్లోకి వెళ్లారు. త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాపై చర్చ మొదలైంది. అల్లు అర్జున్‌తో అనుకున్నా.. ఈ సినిమా లేటయ్యేలా కనిపిస్తుంది. దాంతో ఎప్పట్నుంచో అనుకుంటున్న చిరంజీవి సినిమాను పట్టాలెక్కించాలని గురూజీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

విశ్వంభర ఎలాగూ ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్‌తోనే రన్ అవుతుంది.. కాబట్టి రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేయడం చిరుకు పెద్ద విషయం కాకపోవచ్చు. ఈ లెక్కన చిరు, గురూజీ కాంబో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. తాజాగా పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవిని నిర్మాత చినబాబుతో పాటు వచ్చి కలిసారు త్రివిక్రమ్. చూడాలిక.. ఏం జరగబోతుందో..?