మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ వచ్చే ఏడాది వేసవి మీద ఖర్చీఫ్ వేశారు. ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. మీ కేలండర్లలో మార్క్ చేసుకోండి. బరోజ్ వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌కి రెడీ అవుతోంది అని డిక్లేర్ చేశారు మోహన్‌లాల్.
బరోజ్ ఫాంటసీ సినిమా. జిజో పున్నూస్ రాసిన నవలను సినిమాకు తగ్గట్టు మలచారు. ఈ సినిమాలో నటించడంతో పాటు డైరక్ట్ కూడా చేశారు మోహన్‌లాల్. గురు సోమసుందరం, పద్మావతి రావు, కోమల్ శర్మ, సీజర్ లారెంటే కీలక పాత్రల్లో నటించారు.
మోహన్‌లాల్‌కి కలిసొచ్చిన ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ ఈ సినిమాను కూడా నిర్మించింది. మార్క్ కిలియన్ సంగీతం అందించారు. 13 ఏళ్ల చైల్డ్ ప్రాడసీ లిడియన్ నాదస్వరంతో సంగీత సహకారమందించారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ చేశారు.
బరోజ్ పూర్తి కాగానే మోహన్‌లాల్ లీగల్ డ్రామా నెరులో నటిస్తున్నారు. జీతు జోసెఫ్ ఈ సినిమాకు డైరక్ట్ చేస్తున్నారు. ప్రియమణి, సిద్ధిఖీ, జగదీష్ కీ రోల్స్ చేస్తున్నారు. ఎలాగూ లూసిఫర్ ప్రీక్వెల్ సెట్స్ మీదుంది. ఎల్2 ఎంపురాన్ రీసెంట్‌గా ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.
ప్యాన్ ఇండియన్ సినిమా వృషభంతోనూ మోహన్‌లాల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా లిజో జోస్ పెల్లిస్సేరి సినిమా మలైకోట్టై వాలిబన్‌లోనూ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది మలైకోట్టై వాలిబన్.