
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మీనాక్షి చౌదరి.

వరుసగా లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో అలరించింది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెద్ద హీరోలతో చేసిన సినిమాలు ప్లాప్స్ అయితే తనను బాధ్యురాలిని చేశారని తెలిపింది.

లక్కీ భాస్కర్ సినిమాతో తన లక్ మారిందని చాలా మంది అంటున్నారని... ఆ సినిమా నచ్చిందని.. కానీ ఇకపై పిల్లల తల్లి పాత్ర వస్తే నో చెప్పేస్తానని తెలిపింది. తన హైట్ 6.2 అని.. దీంతో తనతో కలిసి మాట్లేందుకు అమ్మాయిలు కూడా ఇష్టపడేవాళ్లు కాదని తెలిపింది.

సీనియర్ హీరోలతో నటించేందుకు తనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని.. అదో జోనర్ గా భావిస్తానని తెలిపింది. వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేయడం చాలా ఎంజాయ్ చేశానని.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపింది.

తన మీద రూమర్స్ వచ్చినప్పుడు కోపం వస్తుందని.. సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటానని.. ఏదైన ఉంటే తానే అనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చింది. సౌత్ ఇండియన్ కల్చర్ తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.