Meenakshi Chaudhary : సంక్రాంతికి బ్లాక్ బస్టర్స్ పై కన్నేసిన మీనాక్షి.. ఈసారి తగ్గేదే లే అంటున్న హీరోయిన్..

Updated on: Jan 01, 2026 | 5:40 PM

మీనాక్షి చౌదరి.. వరుసగా హిట్స్ అందుకుంటూ జోష్ మీదున్న హీరోయిన్. గ్లామర్ రూల్స్ కాకుండా పాత్ర ప్రాధాన్యత.. కంటెంట్ బట్టి తన సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. నిత్యం సరికొత్త కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఈ కొత్త ఏడాది మరోసారి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకోవడానికి రెడీ అయ్యింది.

1 / 5
మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతోపాటు గ్లామర్ రూల్స్, ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ  మరింత ఫాలోయింగ్ పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
 హర్యానాకు చెందిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. గతేడాది ప్రారంభంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పండక్కి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు కూడా సంక్రాంతికి మరిన్ని హిట్స్ అందుకోవడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతులో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

3 / 5
ఇప్పుడు ఆమె నవీన్ పోలిశెట్టి సరసన అనగనగా ఒక రాజు చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కానుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. అలాగే అక్కినేని నాగచైతన్య సరసన వృషకర్మ అనే చిత్రంలోనూ నటిస్తుంది. ఈ సినిమాలు అమ్మాడి స్టార్ డమ్ మరింత పెంచనున్నాయి.

4 / 5
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత హిట్టు కోసం చాలా కాలం ఎదురుచూస్తింది. అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ మూవీ తర్వాత అమ్మడుకు వరుస ఆఫర్స్ వచ్చాయి.

5 / 5
గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆమె క్రేజ్ నెక్ట్స్ లెవల్ కు వెళ్లింది. ఇప్పుడు ఆమె తెలుగులో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు అనగనగా ఒక రాజు సినిమాతో అలరించనుంది.