Mammootty: అక్కడ మెగాస్టార్ సినిమా బ్యాన్.. షాక్‌లో అభిమానులు !!

| Edited By: Phani CH

Nov 22, 2023 | 8:22 PM

మెగాస్టార్ అంటే చిరంజీవి మాత్రమే కాదు.. చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీకి ఓ మెగాస్టార్ ఉన్నారు.. మనకు చిరంజీవి ఎలాగో.. ఇతర భాషల్లోనూ కొందరు మెగాస్టార్స్ అలాగే ఉన్నారు. మనం మాట్లాడుకుంటున్నది ఇప్పుడు మలయాళ మెగాస్టార్ గురించి. కొన్ని దశాబ్ధాలుగా మమ్ముట్టి మలయాళ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాడు. ఆయన వారసుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. 72 ఏళ్ళ వయసులోనూ ఆ జోరు చూసి మిగిలిన హీరోలకు నిద్ర పట్టడం లేదు.

1 / 8
మెగాస్టార్ అంటే చిరంజీవి మాత్రమే కాదు.. చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీకి ఓ మెగాస్టార్ ఉన్నారు.. మనకు చిరంజీవి ఎలాగో.. ఇతర భాషల్లోనూ కొందరు మెగాస్టార్స్ అలాగే ఉన్నారు. మనం మాట్లాడుకుంటున్నది ఇప్పుడు మలయాళ మెగాస్టార్ గురించి. కొన్ని దశాబ్ధాలుగా మమ్ముట్టి మలయాళ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాడు. ఆయన వారసుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు.

2 / 8
ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. 72 ఏళ్ళ వయసులోనూ ఆ జోరు చూసి మిగిలిన హీరోలకు నిద్ర పట్టడం లేదు. ఇప్పటికీ డిఫెరెంట్ కథలు ఎంచుకుంటూ.. మమ్ముట్టి చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే ఏ హీరోకైనా కడుపు మండాల్సిందే. ఇమేజ్‌తో పట్టింపు లేకుండా ఏ కథ నచ్చినా అందులోకి దూరిపోతున్నాడు ఈ మెగాస్టార్. ఈ మధ్య కాలంలో 60 ప్లస్ హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు కానీ మమ్ముట్టి మాత్రం ఎప్పట్నుంచో ఇదే పని మీదున్నాడు. తాజాగా ఈయన మరో సినిమా కాథల్ ది కోర్. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

3 / 8
ఈ మధ్యే కున్నూర్ స్వ్కాడ్ సినిమాతో వచ్చి సంచలన విజయం అందుకున్నాడు మమ్ముట్టి. దీనికి ఓటిటిలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇదే ఊపులో ఈయన నటించిన కాథల్ ది కోర్ నవంబర్ 24న విడుదల కానుంది. అంతా బాగానే ఉంది ఈ సినిమాను కథర్, కువైట్ లాంటి దేశాలు బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది. దానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. కాథల్ ది కోర్ సినిమాలో మమ్ముట్టి సరసన సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించింది.

4 / 8
 జ్యో బేబీ ఈ సినిమాకు డైరెక్టర్. కువైట్, కథర్ ఈ సినిమాను బ్యాన్ చేయడానికి కారణం అందులో ఉన్న కంటెంట్. ఆయా దేశాల్లో సినిమాలపై చాలా ఆంక్షలు ఉంటాయి. ఏ మాత్రం కంటెంట్ తేడాగా ఉన్నా వెంటనే దాన్ని బ్యాన్ చేస్తుంటారు అక్కడి ప్రభుత్వాలు. ఇప్పుడు మమ్ముట్టి సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది.

5 / 8
పైగా కాథల్ ది కోర్ సినిమా విడుదలకు ముందే కథ మొత్తం బయటికి వచ్చేసింది. ప్రేక్షకులను ముందుగానే ప్రిపేర్ చేయడానికి కథ చెప్పేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో పోషించిన మమ్ముట్టి పాత్ర పేరు జోసెఫ్.. తీకోయ్ అనే చిన్న ఊళ్ళో కో ఆపరేటివ్ బ్యాంకులో పని చేసి రిటైర్ అవుతాడు. ఆ తర్వాత ఊళ్లో జరిగే పంచాయితీ ఎన్నికలలో నిలబడాలని నిర్ణయించుకుంటాడు. అయితే అప్పటి వరకు తనతో బాగానే ఉన్న జోసెఫ్ భార్య ఓమానా ఉన్నట్లుండి కోర్టులో విడాకులకు పిటీషన్ వేస్తుంది.

6 / 8
దానికి కారణం ఏంటయ్యా అంటే తన భర్త స్వలింగ సంపర్కుడని పేర్కొంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అప్పటి వరకు మన మధ్య తిరిగిన మనిషి స్వలింగ సంపర్కుడా అంటూ అంతా ఆశ్చర్యపోతారు. అదే ఊళ్లో ఉండే తంకన్ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపే స్నేహితుడితో సంబంధం ఉందని తన ఫిర్యాదులో పేర్కొంటుంది జోసెఫ్ భార్య. ఈ విషయం ముందే తెలిసినా.. కావాలనే మౌనంగా ఉండి సరిగ్గా ఎన్నికల టైమ్‌లో బయట పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ.

7 / 8
మలయాళంలో మామూలుగానే చాలా సినిమాల కథలు రిలీజ్‌కు ముందే బయటికి వచ్చేస్తుంటాయి. దాన్ని ఎలా చూపించారనే దానిపైనే కథలు ముందుకు వెళ్తుంటాయి. ఇప్పుడు మమ్ముట్టి సినిమా కూడా అంతే. అయితే ఇలాంటి కథను మమ్ముట్టి ఒప్పుకోవడం అనేది ఇక్కడ అసలు విశేషం. గతంలో పృథ్విరాజ్ సుకుమారన్ ముంబై పోలీస్‌లో సినిమాలో గే కారెక్టర్ చేసాడు. అదే సినిమాను మన దగ్గర సుధీర్ బాబు హంట్ పేరుతో రీమేక్ చేసాడు.

8 / 8
ఇప్పుడు మమ్ముట్టి కూడా ఇలాంటి కారెక్టరే ట్రై చేస్తున్నాడు. 72 ఏళ్ళ వయసులో ఆయన చేసిన పాత్ర కావడంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందనే ఉద్దేశ్యంతో కువైట్, కథర్ దేశాల్లో ఈ సినిమాను బ్యాన్ చేసారు. మొత్తానికి రేపు సినిమా విడుదలయ్యాక పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.