చైనాలో 100 రోజులు ఆడిన ఎన్టీఆర్ మూవీ.. 75 ఏళ్ల క్రితమే షేక్ చేసింది

Updated on: May 19, 2026 | 1:23 PM

నేడు మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లు కొల్లగొడుతూ గ్లోబల్ ట్రెండ్ సృష్టిస్తున్నాయన్న విషయం మనకి తెలిసిందే. కానీ, సాంకేతికత లేని ఆ రోజుల్లోనే, దాదాపు 75 ఏళ్ల క్రితమే చైనాలో విడుదలై, ఏకంగా 100 రోజులు ప్రదర్శితమైన ఒక అద్భుత టాలీవుడ్ క్లాసిక్ చిత్రం ఉందనే విషయం మీకు తెలుసా? ఆ విశేషాలు మీకోసం.

1 / 5
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాలు అంతర్జాతీయంగా భారీ వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు విదేశాల్లో, అందులోనూ చైనా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.

2 / 5
సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రచార సాధనాలు ఇస్మంతైనా లేని రోజుల్లోనే, మన తెలుగు సినిమా ఒకటి చైనా సబ్‌టైటిల్స్‌తో అక్కడ విడుదలై, ఏకంగా 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఆ చిత్రమే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు, భానుమతి ప్రధాన పాత్రల్లో నటించిన అమరకావ్యం 'మల్లీశ్వరి'.

3 / 5
దర్శకరత్న బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక వాహిని ప్రొడక్షన్స్ పతాకంపై 1951 డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదలైంది. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం నాటి సామాజిక, సాంస్కృతిక వాతావరణాన్ని ఈ సినిమా కళ్లకు కట్టింది. గ్రామీణ శిల్పి నాగరాజు (ఎన్టీఆర్), అతని మేనత్త కూతురు మల్లీశ్వరి (భానుమతి) చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు.

4 / 5
కానీ, మల్లీశ్వరి రూపలావణ్యాలను చూసి ఆశపడిన ఆమె తల్లి, రాయలవారి అంతఃపురానికి పంపిస్తుంది. విరహంతో కుంగిపోయిన నాగరాజు, తన శిల్పకళా నైపుణ్యంతో హంపి నగరంలో ప్రధాన శిల్పిగా ఎదుగుతాడు. అక్కడ వసంత మండపంలో మల్లీశ్వరి రూపాన్నే శిల్పంగా మలుస్తాడు. ఆ తర్వాత వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది, రాయలవారు వారి ప్రేమానురాగాలను ఎలా గుర్తించారనేదే ఈ చిత్ర ఇతివృత్తం.

5 / 5
ఈ అందమైన దృశ్యకావ్యంలో సంగీతం, సాహిత్యం ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. సాలూరు రాజేశ్వరరావు అందించిన స్వరాలు ఈ సినిమాను కాలాతీతమైన క్లాసిక్‌గా మార్చాయి. 'నెల రాజా వెన్నెల రాజా', 'మనసున మల్లెల మాలలు గారే', 'అవునా నిజమేనా' వంటి అద్భుతమైన పాటలు నేటికీ సంగీత ప్రియుల గుండెల్లో మ్రోగుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలో మొత్తం 17 పాటలు ఉండగా, అందులో 16 పాటలను ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుండి జాలువారడం విశేషం. భానుమతి అద్భుత గాత్రం, ఎన్టీఆర్ ఆహార్యం ఈ సినిమాకు ప్రాణప్రతిష్ఠ చేశాయి.

Follow Us