
సక్సెస్ కోసం సౌత్ కంటెంట్ మీద డిపెండ్ అవుతున్న బాలీవుడ్ ఇప్పుడు.. సౌత్ యాక్టర్స్‌తోనూ టచ్‌లో ఉంటోంది. భారీ చిత్రాల కోసం దక్షిణాది స్టార్స్‌ను హైర్ చేస్తూ.. ఆ సినిమాల మీద సౌత్ సర్కిల్స్‌లోనూ బజ్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తోంది.

ఓ మాలీవుడ్ హీరోతో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ బిజీ అవుతున్నారు.

కోవిడ్ టైమ్‌లో పృథ్వీరాజ్ నటించిన సినిమాలు సౌత్‌లో అన్ని లాంగ్వేజెస్‌లోనూ రిలీజ్ అయి సక్సెస్ అయ్యాయి. దీంతో డౌన్ సౌత్‌లో మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్‌లో చేరారు పృథ్వీరాజ్.

అదే జోరులో బాలీవుడ్ మూవీస్ కూడా లైన్‌లో పెట్టేస్తున్నారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ బాడే మియా చోటే మియా. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించారు పృథ్వీరాజ్.

ఈ మూవీ ఫ్లాప్ అయినా పృథ్వీరాజ్ పెర్ఫామెన్స్‌కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. పదేళ్ల కిందటే అయ్యా మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు పృథ్వీరాజ్. కానీ ఆ తరువాత మళ్లీ హిందీ సినిమా చేయలేదు.

ఇప్పుడు వరుస అవకాశాలతో బాలీవుడ్‌లోనూ బిజీ అవుతున్నారు ఈ మలయాళ స్టార్ హీరో. కరీనా కపూర్, మేఘనా గుల్జర్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో పృథ్వీరాజ్ కూడా నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో హీరోగా ముందు ఆయుష్మాన్ ఖురానాను తీసుకోవాలనుకున్నా.. ఆయన నో చెప్పటంతో పృథ్వీరాజ్‌ను సంప్రదించింది యూనిట్.

ఓ వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో నటుడిగానూ బిజీ అవుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్.