
సినిమాల్లో రాణించాలని... స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలని... ఓ నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ఎందరో..!

వారిలో నార్త్ టూ సౌత్ బాట పట్టి... అవకాశాల కోసం.. పరితపించే అప్‌కమింగ్ స్టార్లు, మోడల్లు ఇంకెందరో..! అలాంటి వారిలో దివ్యాంశ కౌశిక్ కూడా ఒకరు.

ఉత్తరాఖండ్, ముస్సోరిలో పుట్టిన ఈ బ్యూటీ.... తన బ్యూటీఫుల్ లుక్స్‌తో.. మోడలింగ్ రంగంలో తనకంటూ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. కమర్షియల్ యాడ్స్ చేశారు.

ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ వాక్ చేశారు. ఇక అక్కడి నుంచి నేరుగా.. టాలీవుడ్‌లో హీరోయిన్గా అడుగుపెట్టారు. శివ నిర్వాణ డైరెక్షన్లో.. నాగ చైతన్య సరసన.. 'మజిలీ' సినిమాలో నటించారు.

సినిమా హిట్ అయితే అయింది కాని.. ఈబ్యూటీకి అనుకున్నంత బ్రేక్‌ను మాత్రం మజిలీ ఇవ్వలేకపోయింది. ఇక ఆ తరవాత తమిళ్ లో కూడా.. సిద్దార్ధకు జోడీగా ఓసినిమా చేసినప్పటికీ..

అక్కడ కూడా సేమ్ సీన్ రీపీటైంది. దీంతో కాస్త ఢీలా పడిపోయారు ఈ బ్యూటీ.ఇక సరిగ్గా ఇలాంటి టైంలోనే... రవితేజ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది దివ్యాంశకు..!

దీంతో తన ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నారు. పెట్టుకోవడమే కాదు.. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. లిప్ లాక్ కు కూడా ఓకే చెప్పారు.

ఓకే చెప్పడమే కాదు ప్రమోషన్స్ పరంగా చాలా కష్టపడాలని ఫిక్స్ కూడా అయ్యారట.

పర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమాలో తనకు మంచి మార్కులు పడతాయని తన నియర్ అండ్ డియర్స్ దగ్గర చాలా కాన్పిడెంట్‌గా కూడా మాట్లాడుతున్నారట దివ్యాంశ.