Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్‌కు ఆఫర్స్ రాకపోవడానికి ప్రధాన కారణం అదేనా.?

| Edited By: Anil kumar poka

Jan 06, 2024 | 3:33 PM

కీర్తి సురేష్‌.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది మంచి నటీమణులలో ఒకరు.. ఇంకా చెప్పాలంటే ఈ జనరేషన్ మహానటి అనొచ్చేమో..? అంత గొప్పగా నటించడం ఈమెకు మాత్రమే సాధ్యమైన విషయం. చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం బాగానే వచ్చింది. అయితే అంత క్రేజ్ ఉన్నా అవకాశాల వేటలో మాత్రం ఎప్పుడూ వెనకే ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా కీర్తి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఈమె కెరీర్‌ను మొహమాటమే ముంచేస్తుందా..?

1 / 9
కీర్తి సురేష్‌.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది మంచి నటీమణులలో ఒకరు.. ఇంకా చెప్పాలంటే ఈ జనరేషన్ మహానటి అనొచ్చేమో..? అంత గొప్పగా నటించడం ఈమెకు మాత్రమే సాధ్యమైన విషయం. చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం బాగానే వచ్చింది.

2 / 9
అయితే అంత క్రేజ్ ఉన్నా అవకాశాల వేటలో మాత్రం ఎప్పుడూ వెనకే ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా కీర్తి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఈమె కెరీర్‌ను మొహమాటమే ముంచేస్తుందా..? బంగారం లాంటి కెరీర్ కళ్ల ముందు కనిపిస్తుండగా..

3 / 9
అనవసరమైన ప్రయోగాలు చేస్తూ ఉత్తి పుణ్యానికే కెరీర్ నాశనం చేసుకుంటుందా అదీ కాదంటే మహానటి అనే మాయలో పడి.. అక్కడ్నుంచి బయటికి రాలేకపోతుందా అనే ప్రశ్నలు చాలా సార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అవేం కాదు.. చేజేతులా ఈమె కెరీర్ పాడైపోతుందనే వాళ్లు కూడా లేకపోలేదు.

4 / 9
ఎందుకంటే పారితోషికం విషయంలో కీర్తి నో కాంప్రమైజ్ అంటుంది. ట్రెండింగ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్లే సినిమాకు 2 కోట్లు మించట్లేదు.. కానీ కీర్తి సురేష్ మాత్రం తనకు 2.5 కోట్లు ఇవ్వాల్సిందే అంటున్నారని ట్రేడ్ నుంచి తెలుస్తున్న మాట. ఇదే ఈమెకు ఛాన్సులు రాకుండా చేస్తుందని ప్రచారం గట్టిగానే జరుగుతుంది.

5 / 9
సాధారణంగా కెరీర్‌లో ఏదైనా పాత్ బ్రేకింగ్ సినిమా వచ్చినపుడు.. ఆ మత్తులోంచి బయటికి రావడానికి చాలా టైమ్ పడుతుంది. ప్రతీ ఒక్కరికి ఇది జరిగేదే. కీర్తి సురేష్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసిన అనుభవం ఉన్నపుడే ఈమెకు మహానటి ఆఫర్ వచ్చింది.

6 / 9
ఈ చిత్రం వచ్చి ఆరేళ్లు అవుతున్నా ఇప్పటికీ అదే మత్తులో ఉండిపోయింది. మోడ్రన్ మహానటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. ఎంచుకునే పాత్రల విషయంలో మాత్రం కీర్తి సురేష్ తడబడుతుంది. ముఖ్యంగా మొహమాటానికి పోయి ముగినిపోతుందనే విమర్శలొస్తున్నాయి.  కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు చెల్లి పాత్రలు చేయడమంటే ఓ టాప్ హీరోయిన్‌లకు సూసైడల్ లాంటిదే.

7 / 9
అలాంటి నిర్ణయాలు ఒక్కసారి కాదు రెండుసార్లు తీసుకున్నారు కీర్తి. అటు రజినీకాంత్ పెద్దన్న సినిమాలో.. ఇటు చిరంజీవి భోళా శంకర్‌లో చెల్లిగా నటించింది కీర్తి. రెండింట్లో నటిగా గుర్తింపొచ్చింది కానీ కెరీర్‌కు మాత్రం యూజ్ అవ్వలేదు. పైగా ఈ టైమ్‌లో సిస్టర్ రోల్స్ ఏంటంటున్నారు ఫ్యాన్స్. రజినీ, చిరంజీవికి చెల్లి అంటే.. మొహమాటానికి పోయి ఒప్పుకుందేమో అనుకోవచ్చు.

8 / 9
కానీ కథల ఎంపికలోనూ లేడీ ఓరియెంటెడ్ వైపు అడుగులేస్తుంది. అవేమో క్లిక్ అవ్వట్లేదు. మిస్ ఇండియా, పెంగ్విన్, గుడ్ లక్ సఖి ఇలా అన్నీ ఫ్లాపులే. సర్కారు వారి పాటలో గ్లామర్ షో చేసినా.. దసరాలో అద్భుతంగా నటించినా.. అవేమీ కీర్తికి ఆఫర్స్ తెచ్చి పెట్టలేదు. అయితే వీటన్నింటికీ మించి ఉన్న కారణం అయితే రెమ్యునరేషన్.

9 / 9
అక్కడ ఈమెను తట్టుకోవడం కష్టం అంటున్నారు నిర్మాతలు. భరించలేనంత అడుగుతున్నపుడు ఈమెను పక్కన పెట్టడమే నయం అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తెలుగులో ఈమెకు ఛాన్సులు లేకపోయినా.. తమిళం, మలయాళంలో మాత్రం సైరన్, రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివేడి లాంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తుంది కీర్తి. మరి ఇప్పటికైనా ఈమె పద్దతిలో మార్పు వస్తుందేమో చూడాలి.