
అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ లావణ్య త్రిపాఠీ. తొలి సినిమాతో అందం అభినయంతో ఆకట్టుకుంది.

ఆతర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది లావణ్య. యంగ్ హీరోలతో పాటు నాగార్జున లాంటి సీనియర్ హీరోతో కూడా నటించింది.

ఇటీవలే ఈ అమ్మడు మెగా కోడలుగా మారిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ అందాల రాక్షసి.

వీరి వివాహం గత ఏడాది గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది లావణ్య త్రిపాఠి.

తాజాగా రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది లావణ్య. తాను అయోధ్యలో పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నాను అంటూ పో పోస్ట్ షేర్ చేసింది లావణ్య.