
‘ఉప్పెన’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన కృతిశెట్టి ఈ సినిమాలో బేబమ్మగా కుర్రకారును మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే.

ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్‌ను దక్కించుకున్న ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూకట్టాయి.

శ్యామ్‌సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంది

కృతిశెట్టి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది ఫాలోవర్లను దక్కించుకున్న నటిగా నిలిచిందీ ముద్దుగుమ్మ

ఈ అందాల తార ఫాలోవర్ల సంఖ్య తాజాగా ఏకంగా 30 లక్షలు దాటేసింది.

ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.

తన ఫాలోవర్లు 3 మిలియన్‌లకు చేరారని తెలిపిన కృతి, ‘లవ్ యూ ఆల్’ అంటూ రాసుకొచ్చింది.