
తానెప్పుడూ ఇండస్ట్రీలో జరిగే పార్టీలకు వెళ్లాలని అనుకోను అన్నారు కృతి సనన్. నలుగురితో కలిసి, పార్టీలు చేసుకున్నంత మాత్రాన అవకాశాలు రావని, మన పనే మనకి ఛాన్సులు తెచ్చిపెడుతుందని అన్నారు కృతి. జాతీయ అవార్డు అందుకోవడం గొప్ప అనుభూతి అని చెప్పారు కృతి.

హృతిక్ రోషన్‌తో తన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని అన్నారు దీపిక పదుకోన్. వారిద్దరూ కలిసి ఫైటర్‌లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది ఫైటర్. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు దీపిక పదుకోన్. భర్త రణ్‌వీర్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు దీపిక.

కేజీయఫ్‌తో పోలిస్తే సలార్ మరింత డార్కర్‌గా ఉంటుందని అన్నారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది సలార్. ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. డిసెంబర్ 22న విడుదల కానుంది సలార్. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తన కూతురి ముఖంలో చిరునవ్వును చూసిన ప్రతిసారీ, తాను చేస్తున్న పని కరెక్టేనని అనుకుంటానని అన్నారు ప్రియాంక చోప్రా. పనిలో పడి, కూతురి బాగోగుల్ని పట్టించుకోవడం లేదేమో అనే గిల్ట్ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుందని అన్నారు. కానీ ఫ్యామిలీ సపోర్ట్ తో దాన్నుంచి బయట పడుతున్నట్టు తెలిపారు పీసీ

నార్త్ కీ, సౌత్‌కీ మధ్య తానెప్పుడూ తేడాని గమనించలేదని అన్నారు నటి మెహ్రీన్. భాషా పరమైన వ్యత్యాసాలు మాత్రమే ఉంటాయని అన్నారు. మంచి కంటెంట్‌తో సినిమాలు తీయాలనుకునే టీమ్‌లతో పనిచేసినట్టు చెప్పారు. అన్నీ భాషల్లోనూ సినిమాలు చేసి నటిగా మెప్పించాలన్నదే తన గోల్ అని చెప్పారు మెహ్రీన్.