
ఎంత మార్పూ ఎంత మార్పూ... మేకప్ వేసుకోవడానికి, మనీని స్పెండ్ చేయడానికి మధ్య ఇంత మార్పు ఉంటుందా? ఇంత విలక్షణంగా ఆలోచించే వీలుంటుందా? అని నోరెళ్ల బెడుతున్నారు మిమి మాటలు విన్నవారంతా. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఆమెను చూసి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని కూడా సలహాలు ఇస్తున్నారు. ఇంతకీ కృతి సనన్ ఏం అన్నారు? జనాలు ఆమె గురించి అంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారు?

సినిమాకు పనిచేసే నటీనటులు, టెక్నీషియన్లు ఎంత గొప్పవారైనా సరే ప్రేక్షకులను థియేటర్ల దాకా మాత్రమే తీసుకు రాగలుగుతారు. వచ్చిన వారిని కూర్చోబెట్టాల్సిన బాధ్యత మాత్రం కంటెంట్‌దే అని అంటున్నారు కృతి సనన్.

మేకర్స్ ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది కంటెంట్ మీదేనని చెబుతున్నారు. సెట్లో నటనటుల మెయింటెనెన్స్ కి ఎక్కువ ఖర్చు అవుతోందన్న విషయం మీద మిస్ మిమి స్పందించారు. సినిమా సెట్‌లో మన వల్ల ఎంత ఖర్చవుతుందన్న విషయం మీద ఓ అవగాహన ఉండాలి.

నాకెప్పుడూ ఈ ఆలోచన ఉంటుంది. అనవసరంగా ఖర్చు చేయడానికి నా మనసు ఒప్పదు. సెట్లో జరిగే ప్రతి విషయం మీద అవగాహన పెంచుకున్నప్పుడు వృథా ఖర్చులు ఎవరూ చేయరు. అలా కాకుండా విచ్చలవిడిగా ఉండటం అనేది హాస్యాస్పదం అవుతుంది.

బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన వారికి గౌరవం ఉండదు అని అన్నారు. నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్న కృతి సనన్ ఇప్పుడు నిర్మాతగా మారారు. తానే స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నారు. కాజోల్ తో కలిసి నటిస్తున్న దో పత్తి త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. నిర్మాతగా మారిన ఈ టైమ్‌లో కృతి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.